News February 14, 2025
గల్ఫ్ దేశాలకు రాకపోకలకు అనుమతి ఇవ్వండి: మేడా

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి కువైట్ ఎంబసీ అధికారిని కోరారు. న్యూఢిల్లీలోని కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా ఆల్ షెమాలిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. కడప, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని ప్రజలు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు ప్రస్తుతం చెన్నై ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
Similar News
News November 5, 2025
శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

శ్రీశైలంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆయన గుడి పరిసరాలు, నంది మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
News November 5, 2025
NTR: గురుకుల విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్

ఇంటర్ చదివి, నీట్ పరీక్ష రాసిన ఏపీఎస్‌డబ్ల్యూఆర్, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులాల విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని NTR జిల్లా DCO ఎ. మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సబ్జెక్టు నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News November 5, 2025
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ విన్నర్లు

వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళల జట్టు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ నుంచి ప్రత్యేక బస్సులో PM నివాసానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఒక్కో ప్లేయర్‌ను ప్రత్యేకంగా మోదీ అభినందించారు. తర్వాత వారిని సన్మానించారు. బంగ్లాదేశ్‌తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్‌ఛైర్‌లో రావడం గమనార్హం. అంతకుముందు ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది.


