News February 14, 2025

గల్ఫ్ దేశాలకు రాకపోకలకు అనుమతి ఇవ్వండి: మేడా

image

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి కువైట్ ఎంబసీ అధికారిని కోరారు. న్యూఢిల్లీ‌లోని కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా ఆల్ షెమాలిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. కడప, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోని ప్రజలు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు ప్రస్తుతం చెన్నై ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.

Similar News

News March 15, 2025

MHBD జిల్లా అమ్మాయికి వరుస ఉద్యోగాలు

image

మహబూబాబాద్ పట్టణానికి చెందిన డోలి సంధ్య గ్రూప్-3లో 269.9 మార్కులతో 1,125 ర్యాంకు సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ-ఏ మహిళా విభాగంలో రెండో ర్యాంకు సాధించింది. ఇప్పటికే గ్రూప్-4 లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంది. అదే విధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్‌-2 ఫలితాల్లో సంధ్య 382.4 మార్కులతో 205 ర్యాంకు సాధించింది.

News March 15, 2025

SRH అభిమానులకు గుడ్ న్యూస్

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.

News March 15, 2025

తణుకు: పారిశుద్ధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ఫొటో

image

తణుకు పట్టణంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించి, స్వచ్ఛాంధ్ర కల సాకారం చేసుకోవడానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేసి వారితో కలిసి ఫోటో దిగారు. ఈ పిక్‌ను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

error: Content is protected !!