News May 11, 2024
గల్లా మాధవిపై ఫేక్ ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ నాయకులు బి.వి రామాంజనేయులు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులాలు, మతాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 22, 2026
గుంటూరు జిల్లాలో 22 రేషన్ షాపులపై కేసులు

రేషన్ మాఫియా అక్రమాలను అరికట్టడానికి జిల్లా సివిల్ సప్లై యంత్రాంగం పకడ్బందీగా పని చేస్తోందని ఆ శాఖ జిల్లా అధికారి కోమలి పద్మ తెలిపారు. అక్టోబరు నుంచి జిల్లాలో 22 రేషన్ షాపుల మీద 6A కేసులు, 4 క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిపై చర్యలకు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న 763 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, 6A కేసులు 31, క్రిమినల్ కేసులు 28 నమోదు చేశామన్నారు.
News January 22, 2026
GNT: మూడేళ్ల పరారీకి చెక్.. అత్యాచార నిందితుడు అరెస్ట్

అత్యాచార కేసులో నిందితుడిగా ఉండి 3 సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని గుంటూరు నగరంపాలెం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఏటీ అగ్రహారం 2వ లైనుకు చెందిన ఊదర నరసింహారావు అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడని సీఐ సత్యనారాయణ చెప్పారు. తప్పించుకొని తిరుగుతున్న నిందితుణ్ణి పట్టుకున్నామని అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు సహించేది లేదని హెచ్చరించారు.
News January 20, 2026
ANU: ఫిబ్రవరి 3 నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి వ్యాయామ విద్య కోర్సుల పరీక్షలు ప్రారంభమవుతాయని పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం తెలిపారు. బీపీఈడీ, యుజీ పీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.


