News March 8, 2025
గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన విశాఖ మహిళ

స్టీల్ సిటీ గల్లీ నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్‌కు సెలక్ట్ అయిన మొదటి మహిళగా యర్రాజీ జ్యోతి చరిత్ర సృష్టించారు. విశాఖలో సూర్యనారాయణ, కుమారి దంపతులకు ఆగస్టు 28, 1999న జన్మించిన జ్యోతి, నేడు ఒలింపిక్స్‌లో పోటీ చేసి, దేశం గర్వించేలా ఎదిగారు. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్ 12.78 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డు సృష్టించారు. 2024లో అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.
Similar News
News February 11, 2026
విశాఖ హోటళ్లకు పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు

మిలాన్, ఐఎఫ్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సదస్సుల నేపథ్యంలో సీపీ శంఖబ్రత బాగ్చి హోటల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. హోటళ్లలో DFMD, HHMD తనిఖీలు, CCTV నిఘా పెంచాలని ఆదేశించారు. అతిథుల ఐడీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సిబ్బంది వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. VVIPల భద్రతలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు
News February 11, 2026
విశాఖ జిల్లాలో టెన్త్ పరీక్షలు ఎంతమంది రాస్తున్నారంటే?

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. విశాఖ జిల్లాలో 475 స్కూల్స్ నుంచి 29,238 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని DEO ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. 133 సెంటర్లను ఏర్పాటు చేయగా.. ఒకసారి ఫెయిల్ అయిన 1305 విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చని, FEB-12 లోగా HMలను సంప్రదించాలన్నారు.
News February 11, 2026
రేపు సమ్మె.. విశాఖ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి

చెత్తాచెదారం బహిరంగ ప్రదేశాల్లో 12వ తేదీన వెయ్యవద్దని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో కోరారు. దేశవ్యాప్త కార్మికుల సమ్మె 12వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు గురువారం తగ్గే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు చెత్తచెదారం బహిరంగ ప్రదర్శనలో వేయడం మానేసి 13వ తేదీన మీ ఇంటికి వచ్చే క్లాప్ వాహనాలకు పారిశుధ్య సిబ్బందికి అందించాలని విడుదల చేసిన ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు.


