News February 24, 2025

గవర్నర్‌కు ఎర్రగొండపాలెం MLA కౌంటర్

image

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు పేరును తప్పుగా ఉచ్ఛరించారు. దీనిపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్పందించారు. ‘నరేంద్ర పవన్ చంద్రబాబు నాయుడు అని చదివితే బాగుండేది. కూటమి ధర్మం కూడా నిలబడేది’ అంటూ Xలో పోస్ట్ చేశారు.

Similar News

News October 14, 2025

ప్రకాశంలో ఒక్కరోజే ఐదుగురి మృతి

image

ప్రకాశంలో నిన్న విషాద ఘటనలు జరిగాయి. ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున బస్సు బోల్తా పడి ఒకరు చనిపోగా, 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా రిమ్స్ నుంచి మరో వైద్యశాలకు తరలించారు. <<17997659>>CSపురం<<>>, <<17998375>>కొనకనమిట్ల <<>>వద్ద రాత్రి గంటల వ్యవధిలో రెండు ప్రమాదంలో జరిగాయి. ఆ రెండు ఏరియాల్లో ఇద్దరేసి చొప్పున నలుగురు ప్రాణాలు వదిలారు.

News October 14, 2025

ఒంగోలు: ఐటీఐలో చేరాలని ఉందా..?

image

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 5వ విడత ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ప్రసాద్ బాబు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్లు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈనెల 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 17న ఐటీఐ కాలేజీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు.

News October 14, 2025

‘ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపుల విక్రయాలు అరికట్టండి’

image

ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమై కలెక్టర్ చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలన్నారు.