News March 12, 2025
గవర్నర్తో అబద్దాలు చెప్పించారు: KTR

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Similar News
News March 13, 2025
జూన్ నాటికి అర్హులకు 5 లక్షల ఇళ్లు: మంత్రి

AP: రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మించి అర్హులకు ఇస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ఉపయోగించిందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చాక 1.25 లక్షల నిర్మాణాలు పూర్తి చేశామని, మిగిలిన 7.25 లక్షల గృహ నిర్మాణాలను 2026 మార్చిలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
News March 13, 2025
ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘తండేల్’ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో దేశవ్యాప్తంగా నం.1గా ట్రెండ్ అవుతోందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. బ్లాక్బస్టర్ సునామీ ప్రేక్షకులకు ఫేవరెట్గా మారిందని పేర్కొంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ రూ.115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
News March 13, 2025
త్రిభాష విధానానికి సుధామూర్తి మద్దతు

జాతీయ విద్యా విధానంలోని త్రీ లాంగ్వేజ్ పాలసీకి ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి మద్దతు తెలిపారు. దీంతో పిల్లలు చాలా నేర్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు ఏడెనిమిది భాషలు తెలుసని చెప్పారు. కాగా ఈ విధానాన్ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం కావాలనే తమపై మూడో భాషను రుద్దే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తోంది.