News October 23, 2024
గవర్నర్‌ను కలిసిన ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ను నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఖాజా అల్తాఫ్ హుస్సేన్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంతో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంజి యూనివర్సిటీ ప్రగతిని గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు.
Similar News
News November 15, 2025
NLG: ఉపాధ్యాయుల్లో ‘టెట్’ టెన్షన్!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్ పెరిగింది. పీఈటీలు, పీడీలు మినహా ఇతర ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఇన్ సర్వీసు టీచర్లలో ఆందోళన నెలకొంది. పదోన్నతులు, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 వేల మందికి టెట్ తప్పనిసరి కావడంతో ఉపాధ్యాయ సంఘాలు మినహాయింపు కోసం ఎన్సీటీఈ, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
News November 15, 2025
NLG: కుటుంబానికి ఒక్కటే.. అదీ అందడం లేదు!

జిల్లాలో రేషన్ లబ్ధిదారులకు డీలర్లు సంచులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. రేషన్ షాపుల పంపిణీ చేస్తున్న సన్న బియ్యాన్ని సంచుల్లో ఇవ్వాల్సి ఉండగా చాలా గ్రామాలలో లబ్ధిదారులకు అవి పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ రేషన్ ఇస్తున్నా సంచులు ఇవ్వడం లేదు. అదే విధంగా 6 కిలోలకు ఒక సంచి చొప్పున ఇవ్వాల్సి ఉండగా, కుటుంబానికి ఒకటి చొప్పున డీలర్లు పంపిణీ చేస్తున్నారు.
News November 15, 2025
నాగార్జునసాగర్ ఆసుపత్రిలో చిన్నారులకు అస్వస్థత

సాగర్‌లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారికి గ్లూకోజ్, ఇంజెక్షన్లు ఇచ్చాక ఒక్కసారిగా చలి, జ్వరం, వాంతులు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. వారికి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.


