News March 18, 2025
గవర్నర్ను కలిసిన కోనసీమ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కోరుకొండ సత్యనారాయణ కలిశారు. మంగళవారం విజయవాడలో రెడ్ క్రాస్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్తో పాటు కోనసీమ రెడ్ క్రాస్ ఛైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. కోనసీమలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి గవర్నర్కు వివరించారు.
Similar News
News November 23, 2025
అనంత : యాక్సిడెంట్ .. ఇద్దరు మృతి

కళ్యాణదుర్గంలోని గోళ్ల సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో బోరంపల్లి, మానిరేవు గ్రామాలకు చెందిన సురేశ్, సాలప్ప బైకులో వెళ్తుండగా కారు ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో ఇరువురూ మృతి చెందారు. మృతదేహాలను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 23, 2025
WGL: రూ.1.71 లక్షలు కాజేసిన సైబర్ మోసగాళ్లు

వరంగల్ జిల్లా సంగెంలో సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఉద్యోగులమని నమ్మించి మూడు క్రెడిట్ కార్డుల నుంచి రూ.1.71 లక్షలు కాజేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ పేరుతో పంపిన లింక్ ఓపెన్ చేయగానే ఓ వ్యక్తి ఫోన్ హ్యాక్ అయింది. యాక్సెస్, ఎస్బీఐ కార్డుల నుంచి స్విగ్గి లిమిటెడ్ ఖాతాలకు మొత్తాలు తరలించేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు.
News November 23, 2025
కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.


