News April 12, 2025

గవర్నర్‌ను కలిసిన బాపట్ల కలెక్టర్ 

image

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బాపట్ల కలెక్టర్ వెంకట మురళీకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాలలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌కు గవర్నర్ వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. కలెక్టర్ బొకే అందించి గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. ఆయనతోపాటూ ఎస్పీ, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, అధికారులు ఉన్నారు.

Similar News

News November 27, 2025

సిరిసిల్ల జిల్లాలో తొలి రోజు 42 సర్పంచ్ నామినేషన్లు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 42, వార్డు సభ్యుల స్థానాలకు 32 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలి రోజు గురువారం రుద్రంగి మండలంలో సర్పంచ్ 4, వార్డు 5, వేములవాడ అర్బన్ మండలంలో సర్పంచ్ 2, వేములవాడ రూరల్ మండలంలో సర్పంచ్ 7, వార్డు 4, కోనరావుపేట మండలంలో సర్పంచ్ 16, వార్డులకు 12, చందుర్తి మండలంలో సర్పంచ్ 13, వార్డు స్థానాలకు 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News November 27, 2025

గద్వాల: నేరాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: ఎస్పీ

image

నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ టి.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పెండింగ్ కేసులు, దర్యాప్తు నాణ్యతపై చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ సూచించారు.

News November 27, 2025

సంగారెడ్డి: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు టీంల ఏర్పాటు

image

రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తూ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక స్థాయిలో 8 టీంలు, ప్రాథమికోన్నత స్థాయిలో 2 టీంలు, ఉన్నత స్థాయిలో 4 టీంలు, ఉర్దూ మాధ్యమాలలో 1 టీంలను ఏర్పాటు చేశారు. వీరు పాఠశాలలో అమలవుతున్న విద్యాప్రమాణాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు.