News November 6, 2024
గవర్నర్ను కలిసిన షబ్బీర్ అలీ

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబ సమగ్ర సర్వే వివరాలను ఆయనకు వివరించారు. కాగా ఈ కార్యక్రమం పట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News December 12, 2025
NZB: నేటి నుంచి నిషేధాజ్ఞలు: CP

ఈ నెల 14 న నిజామాబాద్ డివిజన్లో నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం శుక్రవారం నుంచి 163 BNSS ఉత్తర్వులు జారీ చేసినట్లు CPసాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్లోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు.
News December 12, 2025
ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
News December 12, 2025
NZB: ఈ నెల 27వ తేదీలోగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడువు

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జీజీ కళాశాల అధ్యయన కేంద్రంలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ,1, 3, 5వ సెమిస్టర్& ఎంబీఏ, బీఎల్ఎస్సీ 2వ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 27తేదీలోగా పరీక్షా ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డా.కె.రంజిత తెలిపారు. ప్రాక్టికల్స్ ఉండే విద్యార్థులు సంబంధిత ఫీజును చెల్లించాలన్నారు. అదనపు సమాచారం కోసం 7382929612ను సంప్రదించాలన్నారు.


