News October 25, 2024
గవర్నర్ ఖమ్మం, కొత్తగూడెం పర్యటన వివరాలు

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం 8గంటలకు భద్రాచలం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 9గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో అధికారులతో భేటీ కానున్నారు. 10 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో కళాకారులు, రచయిత లతో సమావేశం అవుతారు. 11గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1గంట వరకు ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 2గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు పయనం అవుతారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: రైస్ మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష

ఖమ్మం జిల్లాలోని రైస్ మిల్లర్లకు వరి ధాన్యం కేటాయింపు చేసేందుకు బ్యాంకు గ్యారంటీ లేదా సెక్యూరిటీ డిపాజిట్ చూపించడం తప్పనిసరి అని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో రైస్ మిల్లర్ల తో ధాన్యం కేటాయింపు, బ్యాంక్ గ్యారంటీ, పెండింగ్ సీఎంఆర్ రైస్ డెలివరీపై సమీక్ష జరిగింది. రైస్ మిల్లులు అందజేసిన బ్యాంకు గ్యారంటీ ఆధారంగా కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News December 9, 2025
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. అలాగే తెలంగాణ గేయాన్ని ఉద్యోగులందరూ ఆలపించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారిణి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
News December 9, 2025
తొలి విడత ఎన్నికలకు భారీ భద్రత: ఖమ్మం సీపీ

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈ నెల 11న జరిగే ఎన్నిక కోసం 2 వేల మంది సిబ్బందితో పహారా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 953కేసుల్లో 6,403 మందిని బైండోవర్ చేశామన్నారు. రూ.12 లక్షల విలువైన 1,200 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. 16 సరిహద్దు చెక్పోస్టుల ద్వారా తనిఖీలు చేపడుతున్నామని కమిషనర్ వివరించారు.


