News July 28, 2024
గవర్నర్ దత్తాత్రేయ నివాసంలో బోనాల వేడుకలు

ఆషాడ మాసం బోనాలను పరిష్కరించుకొని రామ్ నగర్ లోని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను చెప్పారు.
Similar News
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్‌కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.