News March 23, 2025
గవర్నర్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్న VSU విద్యార్థిని

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం NCC వాలంటీర్ ఎల్.తేజస్వికి గౌరవప్రదమైన గుర్తింపు లభించింది. 2025 జనవరి 26న నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నుంచి ఆమె ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ సునీత ఆమెకు అభినందనలు తెలిపారు.
Similar News
News March 26, 2025
త్వరలోనే కాకాణి అరెస్ట్.?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిన జైలుకు పంపడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని పలువురు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆయనపై పలు కేసులు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతున్నా.. ప్రజా ప్రతినిధుల తీరును తప్పుబడుతున్నా కేసులు నమోదు చేస్తున్నారంటూ వాపోయారు. తాను కేసులు, జైళ్లకు భయపడే రకం కాదని కాకాణి ఇప్పటికే స్పష్టం చేశారు.
News March 26, 2025
నెల్లూరు జిల్లాలోని HM, టీచర్లకు గమనిక

నెల్లూరు జిల్లాలోని ZP ప్రభుత్వ మున్సిపాలిటీ, మండల పరిషత్ పాఠశాలలలో పనిచేస్తున్న హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 28వ తేదీలోగా తెలియజేయాలని డీఈఓ డాక్టర్ ఆర్ బాలాజీ రావు తెలిపారు. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్‌సైట్, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నోటీసు బోర్డులో అందుబాటులో ఉందన్నారు.
News March 26, 2025
నెల్లూరు:నెలాఖరు వరకు ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ

ఆస్తి పన్ను పై వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులను జారీ చేసిందని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు తోడు పేరుకుపోయిన కోట్లాది రూపాయల మొండిబకాయిల వసూళ్ల కోసం రాయితీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.