News March 11, 2025
గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్: BRS

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !
Similar News
News March 12, 2025
మెదక్: హోలీ పండుగ సంతోషంగా జరుపుకోవాలి: ఎస్పీ

హోలీ పండుగను కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సంస్కృతి అద్దం పట్టేలా జరుపుకోవాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు గురై జైలు పాలు కావద్దని సూచించారు. హోలీ పండగ వేళ మన తోటి ఆడపడుచులతో గౌరవప్రదంగా నడుచుకోవాలని తెలిపారు.
News March 12, 2025
కౌడిపల్లి: ఈనెల 17 నుంచి తునికి నల్ల పోచమ్మ జాతర

కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ దేవస్థానం జాతర ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 17న ధ్వజారోహణం, అభిషేకం, గణపతి పూజ, 18న అగ్నిగుండాలు, బోనాలు, 19న బండ్లు తిరుగుట, 20న పాచి బండ్లు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News March 12, 2025
నిజాంపేట: వెంకటేశ్కు రాష్ట్రపతి చేతులమీదుగా బంగారు పతకం

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్కు చెందిన గోపిక వెంకటేశ్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబీశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రింటింగ్, ప్యాకేజ్ ప్యాకేజ్లో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.