News March 11, 2025
గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్న కేసీఆర్

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !
Similar News
News February 23, 2026
నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్(NCRA) 52 పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. అర్హత గలవారు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, BTech/BE, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: http://www.ncra.tifr.res.in/
News February 23, 2026
ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు తీరు మారిందా?

ప్రెగ్నెన్సీలో మహిళల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. అయితే ప్రెగ్నెన్సీలో ఒత్తుగా, పొడవుగా పెరిగిన జుట్టు డెలివరీ తర్వాత రాలిపోతుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్ పెరిగి జుట్టు వేగంగా పెరగడం, జుట్టు టెక్స్చర్ మారుతుంది. డెలివరీ తర్వాత ఇది సాధారణ స్థాయికి చేరడంతో కొన్నిసార్లు స్ట్రెయిట్‌హెయిర్ రింగులుగా, కర్లీ హెయిర్ స్ట్రెయిట్‌గా మారొచ్చని, ఇది సాధారణమేనని చెబుతున్నారు.
News February 23, 2026
ప్లేయింగ్-11లోకి సంజూ? కోచ్ ఏమన్నారంటే?

సంజూ శాంసన్ అద్భుతమైన ప్లేయర్ అని టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డస్కాటే అన్నారు. టాప్ ఆర్డర్‌లో రైట్ హ్యాండర్ ఉండటం కూడా టాక్టికల్‌గా హెల్ప్ అవుతుందని, రాబోయే మ్యాచులకు ఇది టాకింగ్ పాయింట్ అవుతుందని అభిప్రాయపడ్డారు. T20 WC S-8లో SA చేతిలో ఓడిన అనంతరం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొన్ని నెలలుగా బాగా ఆడుతూ ఇప్పుడు ఫామ్ కోల్పోయిన వారిని ఆడించాలా లేదా అనేది సందిగ్ధంగా మారిందన్నారు.


