News December 26, 2024

గాండ్లపెంట: విద్యుదాఘాతంతో రైతు మృతి

image

గాండ్లపెంట మండలం గొడ్డువెలగల గ్రామపంచాయతీలోని నీరుకుంట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర(52) అనే రైతు వ్యవసాయ పొలంలో బోరు వద్ద మోటార్ ఫ్యూజులు వేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే చెందాడు. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Similar News

News January 18, 2026

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్: JNTU వీసీ

image

అనంతపురం JNTUలో ఆదివారం NTR వర్ధంతిని పురస్కరించుకొని వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్యతో కలిసి NTR విగ్రహానికి పూలమాలలు ఘన నివాళులర్పించారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినీ హీరోగా, సీఎంగా ఎదిగిన NTR జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో పలువురు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

News January 18, 2026

అనంత జిల్లా అల్లుడికి 116 రకాల పిండి వంటలు

image

అనంతపురం జిల్లాకు చెందిన గౌతమ్‌ గతేడాది గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంక్రాంతి పండుగకు అత్త గారింటికి వెళ్లారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారు గోదారోళ్ల మర్యాదలు చూపించారు. 116 రకాల పిండి వంటలతో భోజనం వడ్డించారు. కొత్త అల్లుళ్లకు రకరకాల పిండి వంటలతో మర్యాదలు చేయడం ఈ మధ్య గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

News January 18, 2026

అనంతపురం: 19న కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.