News January 20, 2025

గాంధారిలో నకిలీ నోట్లు కలకలం

image

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం భారీగా నకిలీ నోట్లు వెలుగు చూశాయి. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపింది. మండలంలోని చద్మల్ తండాలో లక్ష్మమ్మ ఆలయంలో ఏటా సంక్రాంతి సమయంలో జాతర సాగుతుంది. జాతరలో నకిలీ నోట్లు లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News December 18, 2025

రేవంత్‌ రెడ్డి పతనానికి సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం: హరీష్‌రావు

image

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు 40 శాతం సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పతనానికి నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. మెదక్‌లో గెలుపొందిన నూతన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు బీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారని, రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

News December 18, 2025

సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

image

సుక్మా జిల్లా పరిధిలోని గొండిగూడలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మహిళ మావోయిస్టుతో సహా ముగ్గురు మృతి చెందారు. సుక్మా పోలీసుల వివరాలు.. గొండిగూడ అడవుల్లో మావోలు ఉన్నారన్న సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించామన్నారు. జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఏసీఎం ర్యాంకు, ఒక ఎల్ఓఎస్ సభ్యురాలు మృతి చెందారన్నారు. వారి వద్ద 9 ఎంఎం సర్వీస్ పిస్టల్, 12 బోర్, బార్మర్ గన్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News December 18, 2025

అమరావతిలో కలెక్టర్ల సదస్సుకు అనకాపల్లి కలెక్టర్, ఎస్పీ హాజరు

image

అమరావతి సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన 5వ కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్ విజయక్రిష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ వివరించారు. శాంతిభద్రతలు, గంజాయి నిర్మూలన, నేర నియంత్రణ చర్యలను ఎస్పీ తెలియజేశారు. పరిశ్రమల భద్రత, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దృష్టి నిర్ణయించారు.