News February 24, 2025
గాంధారి: పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: నోడల్ అధికారి

ఈ నెల 5 నుంచి ప్రారంభమై ఇంటర్ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగారం, అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్ కుమార్, సరిత, సుజాత, రమేశ్ పాల్గొన్నారు.
Similar News
News February 24, 2025
ఆరోగ్య సంరక్షణలో విప్లవాత్మక మార్పు

గత ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పెండింగ్లో పెట్టిన సుమారు రూ.1,770 కోట్ల మేర అప్పుల్ని ఎన్డీయే ప్రభుత్వం తీర్చిందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టితో డిజిటల్ పరిజ్ఞానం, సృజనాత్మకత ఉపయోగించడం ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తోందని గవర్నర్ తెలిపారు.
News February 24, 2025
పోలింగ్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జడ్పీలో భద్రపర్చిన పోలింగ్ కిట్లను రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం పరిశీలించారు. మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దం చేయాలని చెప్పారు. 26 నుంచి ఏసీ కళాశాలలో కిట్ల పంపిణీ కోసం ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు.
News February 24, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థులు వీరేనా?

AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూటమి తరఫున భారీగా ఆశావహులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు ఖాళీలకుగానూ టీడీపీ నుంచి కేఎస్ జవహర్, వంగవీటి రాధా, ఎస్వీఎస్ఎన్ వర్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి మాధవ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ రానుండగా 20న ఎన్నికలు జరగనున్నాయి.