News February 24, 2025

గాంధారి: పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: నోడల్ అధికారి

image

ఈ నెల 5 నుంచి ప్రారంభమై ఇంటర్ పరీక్షకు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. సోమవారం గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగారం, అధ్యాపకులు లక్ష్మణ్, విజయ్ కుమార్, సరిత, సుజాత, రమేశ్ పాల్గొన్నారు.

Similar News

News March 23, 2025

పాపం భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

image

KKRతో మ్యాచులో పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను RCB బెంచ్‌కే పరిమితం చేసింది. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే SRHలో ఉండుంటే డగౌట్‌లో కూర్చునే పరిస్థితి రాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ దశాబ్దానికిపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

News March 23, 2025

TODAY HEADLINES

image

* డీలిమిటేషన్‌పై HYDలో బహిరంగ సభ: రేవంత్
* కేంద్ర నిధులు రాబట్టండి.. అధికారులతో సీఎం చంద్రబాబు
* ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’: లోకేశ్
* రూ.2 లక్షలపైన ఉన్నవారికి రుణమాఫీ చేయం: తుమ్మల
* నేనెప్పుడూ కులం, మతం పాటించలేదు: పవన్
* డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి జగన్ లేఖ
* జైలు నుంచి పోసాని విడుదల
* టాలీవుడ్ దేశంలోనే బెస్ట్: మోహన్‌లాల్
* కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం

News March 23, 2025

₹లక్ష దాటిన వెండి ఇన్వెస్టర్లకు సూపర్ ఛాన్స్: జిమీత్

image

జీవితకాల గరిష్ఠానికి చేరిన వెండి ఇన్వెస్టర్లకు సదవకాశం కల్పిస్తోందని శామ్కో వెంచర్స్ CEO జిమీత్ మోదీ అన్నారు. గరిష్ఠాన్ని బ్రేక్ చేసిన ప్రతిసారీ మంచి రాబడిని అందించిందని వివరించారు. 3, 6, 12 నెలల వ్యవధిలో 61, 62, 83% స్ట్రైక్ రేటుతో వరుసగా సగటున 21, 31, 28% రాబడి ఇచ్చిందన్నారు. కొవిడ్ టైమ్ మినహాయిస్తే Silver to Gold రేషియో 30 ఏళ్ల కనిష్ఠమైన 1.09% వద్ద ఉండటం బుల్లిష్‌నెస్‌ను సూచిస్తోందన్నారు.

error: Content is protected !!