News March 29, 2025
గాంధారి: వడ్డీ వ్యాపారులపై కేసు

గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్నారని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.
Similar News
News November 18, 2025
రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ముందంజ

పేరెంట్-టీచర్స్ మీటింగ్ అమలులో రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ముందంజలో నిలిచింది. జిల్లాలో 1,236 పాఠశాలకు 1,146 పాఠశాలలు నమోదై 92.7శాతంతో ముందంజలో నిలిచిందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందకరమైన బాల్యం అందించేలా సూచనలు చేశారు. క్రీడలు, డాన్స్, ప్రసంగం, కథలు చెప్పడం తదితర అంశాల్లో ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కలెక్టర్

జిల్లాలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలని, దీనిపై అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.