News January 25, 2025
గాంధారి: సింగర్ మంగ్లీ సందడి

గాంధారి మండలం చద్మల్ తండాలో శుక్రవారం సింగర్ మంగ్లీ సందడి చేశారు. మధుర లంబాడీల వేషధారణతో పాటను షూటింగ్ చేసేందుకు పరిసరాలను పరిశీలించినట్లు తండావాసులు తెలిపారు. తండాకు వచ్చిన సింగర్ మంగ్లీకి స్థానిక తండావాసులు మధుర లంబాడీల దుస్తులను ఆమెకు బహుకరించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ నిర్వహించనున్నట్లు షూటింగ్ టీం సభ్యులు తెలిపినట్లు స్థానికులు వివరించారు.
Similar News
News December 2, 2025
హైదరాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ

తెలంగాణ రైజింగ్ విజన్‌కు భారీ స్పందన లభిస్తోంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు, వ్యక్తులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌కు చెందిన అజయ్ దేవ్‌గణ్ ఫ్యూచర్ సిటీలో తన ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారు. ఇదివరకు సీఎం రేవంత్ రెడ్డిని కలసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వంతో M0U చేసుకోనున్నట్లు సమాచారం.
News December 2, 2025
సూర్యాపేట: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

ప్రజల్లో రాజకీయ చైతన్యం పెరిగిందనడానికి ఇలాంటి ఫ్లెక్సీలే నిదర్శనం. చిలుకూరు మండలం పాలే అన్నారంలో మంగళవారం యరగాని రామస్వామి ఇంటి ప్రధాన ద్వారానికి ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గ్రామాల్లో అభివృద్ధికి పాటుపడే వారికే ఓటు వేసి తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునే దిశగా అడుగులు వేయాలని రామస్వామి అన్నారు. ఈ ఫ్లెక్సీ వీక్షించిన జనాలు రామస్వామిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
News December 2, 2025
Karnataka: సిద్ద-శివ నాటు చికెన్ ‘బ్రేక్‌ఫాస్ట్’

కర్ణాటక CM సిద్దరామయ్య, Dy.CM డీకే శివకుమార్ మరోసారి భేటీ అయ్యారు. ఇవాళ బెంగళూరులో శివకుమార్ ఇంట్లో ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ జరిగింది. ఇడ్లీ, దోశ, ఉప్మా, నాటు చికెన్ అల్పాహారంగా తీసుకున్నారు. సుపరిపాలన, రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు CMకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసినట్లు శివకుమార్ ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా CM అంశంపై ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే.


