News January 25, 2025
గాంధారి: సింగర్ మంగ్లీ సందడి

గాంధారి మండలం చద్మల్ తండాలో శుక్రవారం సింగర్ మంగ్లీ సందడి చేశారు. మధుర లంబాడీల వేషధారణతో పాటను షూటింగ్ చేసేందుకు పరిసరాలను పరిశీలించినట్లు తండావాసులు తెలిపారు. తండాకు వచ్చిన సింగర్ మంగ్లీకి స్థానిక తండావాసులు మధుర లంబాడీల దుస్తులను ఆమెకు బహుకరించారు. మరో వారం రోజుల్లో షూటింగ్ నిర్వహించనున్నట్లు షూటింగ్ టీం సభ్యులు తెలిపినట్లు స్థానికులు వివరించారు.
Similar News
News February 19, 2025
అదే మా పార్టీ ఆలోచన: KTR

తెలంగాణకు ఏనాటికైనా BRS పార్టీయే రక్షణ కవచం అని KTR అన్నారు. BRS విస్తృతస్థాయి సమావేశం అనంతరం మాట్లాడుతూ ‘KCR గారు ఒకటే మాట చెప్పారు. పార్టీలు ఓడిపోతుంటాయి. గెలుస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు, తెలంగాణ సమాజం గెలవాలి. అదే మా ఆలోచన’ అని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఫైరయ్యారు.
News February 19, 2025
హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్

TG: 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ ఏడాది మే 7 నుంచి 31 వరకు పోటీలు కొనసాగనున్నాయి. ఓపెనింగ్, క్లోజింగ్ సెర్మనీ, గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ పోటీల్లో 120 దేశాల యువతులు అలరించనున్నారు. ఇందులో పాల్గొనే వారి వయసు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు. ఏ దేశంలో పుడితే ఆ దేశం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. విజేతకు వజ్రాల కిరీటం అందిస్తారు.
News February 19, 2025
BNGR: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

రాజాపేట మండలం పుట్టగూడెం కార్యదర్శి అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్థులు బుధవారం జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఇళ్ల కొలతలకు ఒక్కొక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.12 వేలు వసూలు చేశారని, డిజిటల్ సర్వే పేరుతో మోసం చేశారని ఆరోపించారు. పొడవు, వెడల్పు కొలతలు వేయకుండా ప్రైవేటు సర్వేయర్‌తో కుమ్మక్కయ్యారన్నారు. వెంటనే విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.