News January 31, 2025

గాంధీజీకి నివాళులర్పించిన మహబూబాబాద్ కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 16, 2025

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

image

నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం అనుమల్లి పేటకు చెందిన బొడ్డు శ్రీనివాస్‌(45) మృతి చెందాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. మిర్యాలగూడ వైపు బైక్‌పై వెళ్తున్న అతన్ని వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్ కిందపడగా, ట్రాక్టర్ అతనిపై నుంచి వెళ్లింది. శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News November 16, 2025

హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యం: సీఎం

image

AP: సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దానిపై నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని, 2047 కల్లా ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశంగా మారుతుందని చెప్పారు.

News November 16, 2025

మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన: మంత్రి సీతక్క

image

మేడారంలో మాస్టర్ ప్లాన్ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగు మెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా జంపన్న వాగు వంతెనపై జాలి (రక్షణ కంచె) ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.