News October 2, 2024
గాంధీజీ బోధనలు మనకు మార్గదర్శకం: అబ్దుల్ నజీర్

మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయవాడ రాజ్‌భవన్ నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధీజీ చేసిన శాశ్వతమైన బోధనలు మనందరికీ మార్గదర్శకమని, ప్రజలకు స్ఫూర్తినిచ్చే జీవన విధానంగా అహింస మార్గాన్ని ఆయన బోధించారని గవర్నర్ స్పష్టం చేశారు.
Similar News
News November 6, 2025
కృష్ణా: పంచారామాల బస్సులకు.. ఆన్‌లైన్ రిజర్వేషన్

పంచారామాలు, అరుణాచలం, విశిష్ఠ శైవ క్షేత్రాలు, అలాగే యాగంటి, మహానంది, శ్రీశైలం త్రిలింగ దర్శినికి RTC ప్రత్యేక బస్సులు నడుపుతోంది. నవంబర్ 8,9 తేదీల్లో అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల నుంచి శని, ఆదివారం రాత్రి స్పెషల్ సర్వీసులు నడవనున్నాయని RTC అధికారులు తెలిపారు. ప్రయాణికులు ONLINEలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చుని సూచించారు.
News November 6, 2025
కృష్ణా జిల్లాలోకి రానున్న కైకలూరు నియోజకవర్గం

ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న కైకలూరు నియోజకవర్గం త్వరలోనే కృష్ణా జిల్లాలోకి రానుంది. జిల్లాల మార్పుకై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెల్లడించిన వివరాల మేరకు.. ఈ మార్పుకై గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. దీంతో ఏలూరు డివిజన్‌లో ఉన్న కలిదిండి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, మండలాలు గుడివాడ రెవిన్యూ డివిజన్ కిందకు రానున్నాయి.
News November 5, 2025
పెడన: సైబర్ క్రైమ్ కేసు.. విశాఖపట్నంకు ఆరుగురి తరలింపు

విశాఖపట్నం సైబర్ క్రైమ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన ఆరుగురిని అధికారులు పెడనలో అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం విశాఖపట్నానికి తరలించారు. నిందితులపై పెడన పోలీస్ స్టేషన్‌లో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ అరెస్టులు, దర్యాప్తుతో పెడన ఒక్కసారిగా ఉలిక్కిపడింది.


