News July 5, 2024
గాంధీనగర్: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అబ్దుల్ రజాక్ కూతురు(13) ఇటీవల బన్సీలాల్ పేట్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకొని వచ్చింది. అంతదూరం వెళ్లి రావడంపై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 6, 2024
HYD: కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె శనివారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన కుమార్తెకు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. KPHB ఇందు విల్లాస్‌లో రాజేంద్రప్రసాద్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఓదార్చి గాయత్రి భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. ఆదివారం కేపీహెచ్‌బీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
News October 6, 2024
HYD: మోసాలకు అడ్డా.. ‘గోల్డెన్ ట్రయాంగిల్’
HYD మహా నగరంలో ఆన్‌లైన్ మోసాలతో రూ.కోట్లు మాయమవుతున్న ఘటనలు బయటపడ్డాయి. BHEL టౌన్షిప్ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.13.16 కోట్లు, KPHB వైద్యుడి నుంచి రూ.8.6 కోట్లు, నోయిడా వ్యాపారి అకౌంట్ నుంచి రూ.9.09 కోట్లు మాయమయ్యాయి. ఈ సొమ్ము ‘గోల్డెన్ ట్రయాంగిల్’గా పిలిచే థాయ్‌లాండ్ , లావోస్, మయన్మార్ దేశాల్లోని ముఠాల చేతుల్లోకి వెళ్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది.
News October 6, 2024
HYD: 2,525 చెరువులకు హద్దులు ఖరారు
HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.