News February 13, 2025
గాంధీభవన్లో రేపు యువజన కాంగ్రెస్ ప్రమాణం

రేపు గాంధీభవన్లో యువజన కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఢిల్లీ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
Similar News
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
News December 4, 2025
HYD: IITల్లో నీటిని ఒడిసిపట్టే చెరువు

రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణతో వర్షపు నీటిని ఒడిసిపట్టే పరిస్థితి తగ్గుతోంది. దీంతో ఎండాకాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన IIT HYD విద్యా సంస్థ 654 ఎకరాల ప్రాంగణంలో లోలెవెల్ ఏరియాలో చెరువును అందుబాటులోకి తెచ్చింది. అక్కడ కురిసిన వర్షపు నీరు మొత్తం ఇందులోకి వచ్చి చేరుతుంది. దీని కెపాసిటీ 2.28 కోట్ల లీటర్లుగా అధికారులు తెలిపారు.
News December 4, 2025
CBSE నోటిఫికేషన్.. 124 పోస్టులు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 124 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ, అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ పాసై ఉండాలి. వయసు 27-35 ఏళ్లు. <


