News November 17, 2024
గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుంది..?: రఘునందన్ రావు

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఐపీ, ఓపి విభాగాలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. X-ray తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి అన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా..? అని X వేదికగా ఎంపీ నిలదీశారు.
Similar News
News October 30, 2025
మెదక్: మహిళపై దాడి, దోపిడీ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

మెదక్ జిల్లాలో మహిళపై దాడి, దోపిడీ కేసులో నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మహిళపై దాడి చేసి, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాలు లాక్కొని, అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో నిందితుడు పకీరా నాయక్కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించిందని పేర్కొన్నారు. నిందితుడికి గతంలోనే వేరే కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది.
News October 30, 2025
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఐఈవో

రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యా బోధన చేయాలని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి(డీఐఈవో) మాధవి ఆదేశించారు. బుధవారం ఆమె జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించిన మాధవి, విద్యార్థులతో మాట్లాడి సబ్జెక్టుల వివరాలు అడిగారు. ప్రతి విద్యార్థిపై అధ్యాపకులు శ్రద్ధ చూపాలని దిశానిర్దేశం చేశారు.
News October 30, 2025
నూతన క్వారీలకు అనుమతి తప్పనిసరి: మెదక్ కలెక్టర్

మెదక్ జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్, నూతన క్వారీల మంజూరు కోసం రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ(సీయా) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరని కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లా సర్వే నివేదికను రూపొందించినట్లు తెలిపారు.


