News April 9, 2024
గాంధీ ఆస్పత్రిలో డయాగ్నొస్టిక్ సేవలు ఇలా..!
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినెల దాదాపుగా 100 అల్ట్రా సౌండ్ స్కానింగ్ 3,000 సీటీ స్కాన్, సుమారు 700 ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో MRI ప్రారంభం కాకపోవడం వల్ల, గాంధీ ఆసుపత్రికి MRI స్కానింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
Similar News
News November 5, 2024
HYD: రాహుల్ గాంధీ బావర్చీకి రావాలని డిమాండ్
HYDలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్నగర్కు రావాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బావర్చీలో కుర్చీ వేసి, ప్లేట్లో బిర్యానీ వడ్డించారు. బిర్యానీ చల్లబడకముందే రావాలని BRS సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి సూచించారు. పలువురు నిరుద్యోగులు కూడా రాహుల్ గాంధీ రావాలని కోరారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
News November 5, 2024
HYD: నాంపల్లి క్రిమినల్ కోర్టుకు దీపాదాస్ మూన్షీ
నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి హాజరయ్యారు. దీపా దాస్పై BJP నేత ప్రభాకర్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఆయనపై దీపాదాస్ మున్షీ పరువు నష్టం దావా కేసు వేసింది. దీపాదాస్తో పాటు కోర్టుకు బీజేపీ నేత ప్రభాకర్ హాజరయ్యారు. మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.
News November 5, 2024
రేపు సోమాజిగూడలో సైబర్ సెక్యూరిటీ వార్షిక సమ్మిట్
సైబర్ భద్రతకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు సైబర్ సెక్యూరిటీ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో బుధవారం ఈ కార్యక్రమం జరగనుంది. సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సైబర్ భద్రతపై తీసుకోవలసిన జాగ్రత్తలను సమావేశంలో చర్చిస్తారన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారన్నారు.