News March 5, 2025
గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ సమీక్షా సమావేశం

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి, మంత్రి సీతక్క హాజరై జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్యే బొజ్జు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, విష్ణునాథ్, విశ్వనాథం పాల్గొన్నారు.
Similar News
News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
News March 6, 2025
ఆదిలాబాద్: పరీక్ష కేంద్రంలో ఇంటర్ విద్యార్థికి అస్వస్థత

ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. గురువారం సెకండ్ ఇయర్ పరీక్ష జరుగుతున్న సమయంలో బాపురావు అనే విద్యార్థికి అకస్మాత్తుగా ఆస్తమా, బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 లో రిమ్స్ తరలించగా.. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.
News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.