News November 26, 2024
గాంధీ భవన్‌లో ఇంటలెక్చవల్ కమిటీ సమావేశం
నాంపల్లిలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ ఇంటలెక్చవల్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారితో పాటు మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితర నాయకులు ఉన్నారు.
Similar News
News December 12, 2024
HYDలో వైజాగ్ యువతితో సహజీవనం.. మోసం!
యువతితో సహజీవనం చేసి ఆమె నుంచి రూ.లక్షల్లో తీసుకొని ఉడాయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధురానగర్ PS పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వైజాగ్‌కు చెందిన యువతి HYDలో బ్యూటీషియన్‌గా పని చేస్తూ స్థిరపడింది. ఆమెకు ఓ క్యాబ్‌డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో సహజీవనం చేశాడు. పెళ్లి ప్రస్తావన రాగానే ఇద్దరి మతాలు వేరు అంటూ ముఖం చాటేశాడు. అతడి కోసం మతం మారినా మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 12, 2024
HYDలో 84,000 ఇందిరమ్మ ఇళ్లు!
HYDలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్‌న్యూస్. లబ్ధిదారుల వివరాలు పరిశీలించేందుకు ప్రభుత్వం సర్వేయర్లను నియమించింది. HYDలో 5,00,822, మేడ్చల్‌లో 3,22,064, రంగారెడ్డిలో 1,96,940, పటాన్‌చెరు నియోజవకర్గంలో 20,711, కంటోన్మెంట్‌లో 29,909 దరఖాస్తులు వచ్చాయి. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్‌లో 84,000 ఇళ్లు నిర్మించాలి.
News December 12, 2024
HYD: కుమ్మరిగూడలో కొలువుదీరిన ముత్యాలమ్మ
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠ బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. గుడిపై దాడి అనంతరం సికింద్రాబాద్‌లో తీవ్ర ఘర్షణ నెలకొంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు సైతం నివ్వెరపోయాయి. దాడిని తీవ్రంగా ఖండించాయి. యుద్ధప్రాతిపదికన నిధులు విడుదల చేసిన సర్కార్ అమ్మవారిని కొలువుదీర్చారు. భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.