News January 15, 2025

గాజువాకలో దారుణం.. చిన్నారి మృతి

image

గాజువాకలోని పండగ వేల ఒక అపార్ట్మెంట్ వద్ద సెల్లార్‌లో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిని కారు ఢీకొంది. తీవ్రగాయాలతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. సుజాతనగర్ ప్రాంతానికి చెందిన భోగిర్ల లారీణి తన తల్లిదండ్రులతో సెల్స్ట్ అపార్ట్మెంట్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. చిన్నారి ఆడుకుంటుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు కారు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. పండగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News January 1, 2026

జీవన్‌దాన్ ద్వారా వారి జీవితంలో కొత్త వెలుగులు

image

రాష్ట్ర వైద్యరంగంలో మరో సరికొత్త రికార్డు నమోదయింది. 301 మందికి జీవన్‌దాన్ (అవయవ దానం) ద్వారా జీవితాల్లో వెలుగులు నింపారు. 2015 నుంచి ఇప్పటివరకు 1293 అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించామని విమ్స్ డైరెక్టర్ జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు తెలిపారు. జీవన్‌దాన్ చేస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.

News January 1, 2026

విశాఖలో కూటమి నేతల ఐక్యత స్వరం

image

స్టీల్ ప్లాంట్, విశాఖ భూముల అంశాలు, తదితర సమస్యలపై YCP, వామపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు సమాధానం చెప్పే విషయంలో విశాఖ MP, MLAలు ఒక్కో విధంగా స్పందిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. దీంతో వీరి మధ్య సరైన సమన్వయం లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయన్న వాదనలున్నాయి. అయితే అనూహ్యంగా బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ‘మేమంతా కలిసే ఉన్నాం’ అని సంకేతాలిచ్చారు.

News January 1, 2026

విశాఖ జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన

image

న్యూఇయర్ వేడుకల వేళ విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సరికొత్త ఆలోచన చేశారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకొని అధికారులు, సిబ్బంది పూల బొకేలు, స్వీట్లు కాకుండా పేద‌ల‌కు, అనారోగ్య బాధితుల‌కు ఉప‌యోగప‌డే విధంగా నెల‌కొల్పిన సంజీవ‌ని నిధికి విరాళాలు అందించాలని ఆయన సూచించారు. క‌లెక్ట‌ర్ త‌న కార్యాల‌యంలో గురువారం ఉద‌యం 9.30 నుంచి అందుబాటులో ఉంటారు.