News March 15, 2025
గాజువాకలో బాలికపై అత్యాచారయత్నం..!

గాజువాకలో మైనర్పై అత్యాచారయత్నం కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై దాడి భాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చిన్నారి వారికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భాను ప్రకాష్ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Similar News
News March 17, 2025
అరిలోవ: జైలులో ఖైదీలకు ఫోన్లు అందించిన దంపతులు అరెస్ట్

సెంట్రల్ జైలులో ఖైదీలకు ఫోన్లు అందించిన కేసులో భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దంపతులు శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్లో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News March 17, 2025
అనకాపల్లి: దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. నిలిచిన రైళ్లు

అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. రాత్రి రైల్వే వంతెన కింద నుంచి వెళ్తున్న ఓ భారీ వాహనం గడ్డర్ను ఢీకొనడంతో అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. ఈ నేపథ్యంలో కశింకోటలో గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్లు, యలమంచిలిలో మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
News March 17, 2025
టెన్త్ విద్యార్థులకు ఫ్రీ బస్

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విశాఖ జిల్లాలోని విద్యార్థులందరినీ బస్సుల్లో ఉచితంగా పరీక్షా కేంద్రాలకు చేరుస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 7 డిపోల నుంచి 150 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా సమయానికి ముందు, ముగిసిన తర్వాత 2.30 గంటల వరకు బస్సులు షెడ్యూల్, స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.