News February 23, 2025

గాజువాకలో యువకుడు సూసైడ్?

image

గాజువాక సమీపంలో గల అక్కిరెడ్డిపాలెంకు చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం ఉదయం గుర్తించారు. విశాఖ డైరీ సర్వీస్ రోడ్డులోని శ్రావణి షిప్పింగ్ భవనం పక్కనే చెట్టుకు మృతదేహం వేలాడుతూ ఉంది. ఫ్రూట్ షాప్‌లో పనిచేస్తున మృతుడు కర్రీ ప్రవీణ్‌(27)గా గుర్తించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 25, 2025

విశాఖ: నాగుల చవితి సందర్భంగా ‘జూ’కు పోటెత్తిన సందర్శకులు

image

విశాఖ జూలో నాగుల చవితి సంబరాలు అంబరాన్నంటాయి. సందర్శకులు కుటుంబ సమేతంగా జూపార్క్‌కు తరలివచ్చి పుట్టలలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. చవితి సందర్భంగా 9,664 మంది ‘జూ’ను సందర్శించగా సుమారు రూ.7.60 లక్షల ఆదాయం సమకూరినట్లు జూ క్యురేటర్ మంగమ్మ ప్రకటించారు. జూ పార్క్‌లో టపాసులు కాల్చవద్దని నిబంధన ఉండడంతో ప్రవేశ ద్వారం వద్ద క్షుణ్ణంగా పరీక్షించి సందర్శకులను పంపించినట్లు తెలిపారు.

News October 25, 2025

విశాఖ: 69 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 69 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.

News October 25, 2025

మంత్రి సత్యకుమార్ విశాఖ పర్యటన వివరాలు

image

రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అక్టోబర్ 26, 27 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అక్టోబర్ 27న ఉదయం ఏఎంసీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం VIMS క్యాంపస్, ఆరిలోవలో ప్రాంతీయ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం లాసెన్స్ బేలోని బీజేపీ కార్యాలయంలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.