News March 27, 2024
గాజువాక: నేలబావిలో సెక్యూరిటీ గార్డు మృతదేహం
గాజువాక ఆటోనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆటోనగర్ ఎస్ బ్లాక్‌లో టీపీఎల్ ప్లాస్టిక్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ గణేష్ (31) నేలబావిలో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడు. ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
విశాఖ: కాలేజీ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
పద్మనాభం మండలం పొట్నూరు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయనగరం నుంచి సైకిల్ పై స్వగ్రామం పొట్నూరు వస్తున్న పరదేశి(48)ని కాలేజీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నాడు. విధులకు హాజరు కావడానికి సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పద్మనాభం పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 8, 2025
కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహా కుంభమేళాకు విశాఖ నుంచి ప్రత్యేక రైలు వేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం సందీప్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 10, 22 తేదీలలో రాత్రి 10.20 గంటలకు విశాఖ-గోరఖ్ పూర్ (08588) బయలుదేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 13, 25 తేదీలలో సాయంత్రం 5:45కు గోరఖ్‌పూర్‌లో బయలుదేరునుందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News February 8, 2025
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో విశాఖ క్రీడాకారులకు పతకాలు
రాజస్థాన్‌లో జరుగుతున్న 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో విశాఖ నుంచి 33 క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 5 స్వర్ణ, 7రజత, 10 కాంస్య పతకాలను సాధించి విజేతలుగా నిలిచారు. వీరికి శుక్రవారం పలువురు అభినందనలు తెలిపారు. విశాఖ అథ్లెట్స్ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాక్షించారు.