News February 8, 2025
గాజువాక: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

గాజువాక సమీపంలో గల దువ్వాడ రైల్వే స్టేషన్ పరిధిలో అగనంపూడి రైల్వే ట్రాక్ వద్ద రాదేశ్(38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీహరిపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
Similar News
News February 6, 2026
చెత్త తరలించడంలో జీవీఎంసీ నిర్లక్ష్యం..

చెత్త తరలించడంలో జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి గురువారం రాత్రి చోటుచేసుకున్న పరిణామమే నిదర్శనం. నగరం నుంచి ఎండాడ మీదుగా డంపింగ్ యార్డ్‌కు చెత్తను తరలిస్తున్న ఒక వాహనం అధిక మోతాదులో లోడింగ్ చేసుకొని రహదారి అంతా ఒలిగిపోయేలా వెళ్లింది. నిబంధనల ప్రకారం నెట్టు కట్టి చెత్త తరలింపు చేయవలసి ఉన్నా.. ఆ దిశలో కాంట్రాక్టర్‌లు చర్యలు తీసుకోవడం లేదు.
News February 6, 2026
ఎస్.కోట: ఒక పార్టీ.. మూడు వర్గాలు!

రాజకీయంగా విశాఖకు, పరిపాలన పరంగా VZM జిల్లాకు చెందిన ఎస్.కోట నియోజకవర్గంలో TDP 3 వర్గాలుగా విడిపోయింది. MLA లలిత కుమారి, జిల్లా సహకార మార్కెటింగ్ ఛైర్మన్ గొంప కృష్ణ, ఇందుకూరు సుధారాణి (MLC రఘురాజు భార్య) చెరో వర్గంలో ఉన్నారు. ఇటీవల 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి MLA వీరికి ఆహ్వానాలు ఇవ్వలేదంటూ ఈ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో నియోజకవర్గంలో వర్గపోరు నడుస్తున్నట్లు బట్టబయలైంది.
News February 6, 2026
విశాఖలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు

విశాఖలో క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం జిల్లాలో 7,205 కేసులు నమోదయ్యాయి. అన్ని వయస్సుల వారిలో బ్రెయిన్, రొమ్ము, ఊపిరితిత్తులు, నోరు, జీర్ణాశయ, గైనకాలజికల్ క్యాన్సర్లు కనిపిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, వ్యసనాలు, ప్లాస్టిక్ వినియోగమే ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు పేర్కొంటున్నారు. క్యాన్సర్ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు.


