News February 18, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

గాజువాక షీలా నగర్ హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైలపల్లి మనోహర్ బైక్‌ను నడుపుతుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని తండ్రి పేరు దేముడు అని ఐడి కార్డులో రాసి ఉంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 16, 2025

విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

image

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్‌లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్‌ జంప్, ఓవర్‌ స్పీడ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్‌ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.

News October 16, 2025

విశాఖలో ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే.. నిషేధం ఎక్కడా?

image

GVMC పరిధిలో పాలిథిన్ వినియోగం ఆగడం లేదు. ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించినా.. అమలు మాత్రం జరగడం లేదు. మార్కెట్లు, కిరాణా షాపులు, కూరగాయల సంతలు ఇలా ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లు సులభంగా దొరుకుతున్నాయి. GVMC అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిషేధం కేవలం ప్రకటనలకే అంకితమైందని పలువురు విమర్శిస్తున్నారు. కాలుష్యం పెరిగి, డ్రైనేజీ వ్యవస్థలు మూసుకుపోతున్నా చర్యలు లేవని మండిపడుతున్నారు.

News October 16, 2025

వందేళ్ల ప్రస్థానం: ఆంధ్రా వర్సిటీ వైభవం

image

ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఏయూ) ఒక విజ్ఞాన ఖని. ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో నాణ్యమైన విద్యను ఏయూ అందిస్తోంది. మెరైన్, బయాలజీ వంటి ప్రత్యేక కోర్సులకు నిలయం. వెంకయ్య నాయుడు, విశ్వనాథ సత్యనారాయణ వంటి మహామహులు ఇక్కడి పూర్వ విద్యార్థులే. శతాబ్ద కాలంగా ఈ విజ్ఞాన ఖని బాధ్యతగల పౌరులను, నాయకులను తీర్చిదిద్దుతూ ఆంధ్రుల గర్వకారణంగా నిలుస్తోంది.