News May 11, 2024
గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా: కావ్య

గత పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ మనకు అవసరమా? అని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ప్రశ్నించారు. భీమారంలో నిర్వహించిన రోడ్ షోలో కావ్య పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలోని కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చారని మండిపడ్డారు. వరంగల్ ప్రజలు బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కావ్య అన్నారు.
Similar News
News February 15, 2025
జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

అధికారులందరు సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను సజావుగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
News February 15, 2025
WGL: ఎక్కడ చూసినా అదే చర్చ..!

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్, సంగంరెడ్డి సుందర్ రాజ్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
వరంగల్: ఎన్నికలకు రెడీ.. వాయిదాపై అధికారుల నిట్టూర్పు!

మూడు రోజుల ముందు వరకు వరంగల్ జిల్లాలోని అధికార యంత్రాంగం స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై తలమునకలయ్యారు. ఇంతలోనే BC సర్వే పూర్తయ్యాకే ఎన్నికల్లోకి వెళ్తామని మంత్రులు ప్రకటించడంతో అధికారులు నిరుత్సాహానికి గురయ్యారు. WGL జిల్లాలో 323 పంచాయతీలు, 130 MPTC, 11 ZPTC స్థానాలు ఉన్నాయి. వాటి ఎన్నికల కోసం ఇప్పటికే RO, AROలకు ట్రైనింగ్, సామగ్రి, పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సిద్ధం చేశారు.