News March 23, 2025
గాయపడ్డ కానిస్టేబుల్ను పరామర్శించిన కేటీఆర్

కరీంనగర్లో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో నగరంలో ర్యాలీలో నిర్వహించారు. ఈ ర్యాలీలో ఓ మహిళా కానిస్టేబుల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయపడ్డ పద్మజాను కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాలీలో బైక్ వేగంగా రావడంతోనే గాయపడినట్టు మహిళా కానిస్టేబుల్ కేటీఆర్కు వివరించారు.
Similar News
News December 13, 2025
KNR: 567 మంది మహిళలు మాయం

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో Jan 2024 నుంచి Oct 2025 వరకు 567 మంది మహిళలు, యువతుల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇవేగాకుండా పోలీసుల దృష్టికి రానివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేదిస్తే చాలా కేసులు మిస్టరీగానే ఉండిపోతున్నాయి. అదృశ్యమైన వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోతున్నారనేది అంతుచిక్కట్లేదు. కొందరు రాష్ట్రాలు, దేశ సరిహద్దులు దాటుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
News December 13, 2025
KNR: స్వచ్ఛ హరిత రేటింగ్.. 8 పాఠశాలలు ఎంపిక

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.