News March 12, 2025
గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News November 1, 2025
ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.
News November 1, 2025
పుష్కర కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

గోకవరం మండలం తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్ప భగవాన్ (35) పుష్కర కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ శనివారం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
సిరిసిల్ల: ‘ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోండి’

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ఆరోగ్య పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని రాజన్నసిరిసిల్ల జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ రజిత సూచించారు. శనివారం సిరిసిల్లలోని అంబేడ్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. టీకాలు నిల్వఉంచే కోల్డ్ చైన్ రికార్డులను నిశితంగా తనిఖీచేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.


