News January 5, 2025
గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి
గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.
Similar News
News January 9, 2025
ఇచ్ఛాపురం స్వల్ప భూ ప్రకంపనలు
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం మండలంలో బుధవారం రాత్రి 10:56 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
News January 8, 2025
మెళియాపుట్టిలో సినిమా షూటింగ్ సందడి
మెళియాపుట్టి పరిసర ప్రాంతాల్లో బుధవారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై తీస్తున్న సినిమా చిత్రీకరణ మండలంలోని కరజాడలో బుధవారం జరిగింది. హీరో, హీరోయిన్లుగా గోపాల్ రెడ్డి, శృతి, ప్రధాన పాత్రల్లో డా.కుమార్ నాయక్, ఆశిష్ చోటు ఉన్నారని సినిమా దర్శకుడు శివశంకర్ తెలిపారు. వీరితో పాటు నిర్మాత స్వాతి ఉన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, ఒడియా మూడు భాషల్లో విడుదల కానుంది.
News January 8, 2025
శ్రీకాకుళం: మోదీ సభా స్థలి ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అచ్చెన్న
విశాఖపట్నంలో భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను టెక్కలి ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పర్యవేక్షించారు. పలువురు అధికారులతో వారితో మాట్లాడి సూచనలు చేశారు.