News January 5, 2025

గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి

image

గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.

Similar News

News March 11, 2026

శ్రీకాకుళం: ఆగి ఉన్న కారును ఢీకొన్న లారీ

image

శ్రీకాకుళం మండలం జాతీయ రహదారిలో ఉన్న డెంటల్ కాలేజీ వద్ద బుధవారం ఆగి ఉన్న కారును లారీ ఢీకొంది. కారు మరమ్మతులకు గురికావడంతో కారులో ఉన్నవారు దిగి మెకానిక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలోనే నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

News March 11, 2026

శ్రీకాకుళం: చోరీ కేసులో వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష

image

రైళ్లలో ప్రయాణీకుల సెల్ ఫోన్లు, ఛార్జర్లు చోరీకు పాల్పడుతున్న వ్యక్తికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని నారాయణపూర్‌కి చెందిన జగదీశ్ రెడ్డి అనే యువకుడికి ఆరునెలలు జైలు శిక్ష విధించినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ సోమేశ్వరరావు మంగళవారం తెలిపారు. చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకుని విచారణ జరిపి విశాఖ రైల్వే కోర్టులో హాజరుపరచడంతో కోర్టు ఈ తీర్పు ఇచ్చిందని ఎస్ఐ పేర్కొన్నారు.

News March 11, 2026

కోడి పందేల శిబిరంపై దాడి: నరసన్నపేట ఎస్సై

image

నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలోని వంశధార నది పరివాహక ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందుకున్నామని ఎస్సై బి.గణేశ్ తెలిపారు. ఈ మేరకు తమ సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం దాడి చేశామని వెల్లడించారు. ఈ దాడిలో ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.10,700 స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. వారిపై కేసు నమోదు చేశామన్నారు.