News April 15, 2025

గార : పోరుబందరు పోర్ట్‌లో మత్యకారుడు అదృశ్యం

image

గార మండలం మోగదాలపాడుకు చెందిన మత్స్యకారుడు పుక్కళ్ల సిద్ధార్థ (సర్దార్) (44) చేపలు వేట కోసం గుజరాత్‌లోని పోరుబందరు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 8వ తేదీన వేట పూర్తైన తరువాత రూమ్‌కి రాలేదని బోట్ డ్రైవర్ గురుమూర్తి మంగళవారం తెలిపారు. అప్పటి నుంచి వెతికామని ఆయన కానరాలేదన్నారు. సిద్ధార్థకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News April 19, 2025

కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

image

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.

News April 19, 2025

బూర్జ : స్విమ్మింగ్‌లో అరుదైన రికార్డు

image

బూర్జ మండలం డొంకలపర్తికి చెందిన గణేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పారా స్విమ్మర్‌గా అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు క్రీడా ప్రాధికార సంస్థ స్విమ్మింగ్ కోచ్ గణేశ్ శుక్రవారం శ్రీలంకలోని తలైమన్నారు నుంచి భారతదేశంలోని ధనుష్కోటి వరకు పోటీజరిగింది. 28 కిలోమీటర్లను 10:30 గంటల్లో స్విమ్ చేసి రికార్డు నెలకొల్పారని AP పారాస్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. రామస్వామి తెలిపారు.

News April 19, 2025

బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

image

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.

error: Content is protected !!