News July 29, 2024
గార: సాగునీటి కోసం తోపులాట.. వృద్ధుని మృతి

గార మండలం కోళ్లపేట గ్రామంలో సాగునీటి కోసం జరిగిన తోపులాటలో వృద్ధుడు మృతి చెందిన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తట్ట తౌడు(70) తన పొలానికి వెళ్తున్న సాగునీరు వంజల సునీత పొలం మీదుగా వెళుతుండడంతో నీటిని తౌడు తన పొలానికి మళ్లించాడు. ఇది తెలుసుకున్న సునీత పొలం వద్దకు వచ్చి ఘర్షణకు దిగి ఒకరికొకరు తోసుకోగా తౌడు కిందపడి గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
Similar News
News October 30, 2025
శ్రీకాకుళం: 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం

తుఫాన్ వర్షాలు కారణంగా జిల్లాలో 2,230 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా చేతికి అంది వచ్చిన పంట నేలవాలిందని, కొన్నిచోట్ల నీట మునిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి తుది అంచనా సిద్ధం చేస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫారుక్ అహ్మద్ ఖాన్ తెలిపారు.
News October 30, 2025
ఇచ్ఛాపురంలో పర్యటించిన జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్

‘మెంథా’ తుపాను ప్రభావంతో జిల్లాలో నష్టం వాటిల్లిన నేపథ్యంలో, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఇచ్ఛాపురం మండలంలో పర్యటించారు. తుపాన్ కారణంగా జిల్లాలో అత్యధికంగా ఈ మండలంలో 1,118 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. బిల్లంగి, జగన్నాథపురం గ్రామాల్లో నీటి ముంపులో ఉన్న వరి చేలును ఆయన పరిశీలించారు. 53 క్యూసెక్కులు నీరు బహుదానదిలో ప్రవహిస్తుందన్నారు. నష్టం అంచనా వేయాలన్నారు.
News October 30, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

★పొందూరులో 50 గ్రామాలకు రాకపోకలు బంద్
★సోంపేట ప్రభుత్వ పాఠశాలలో కూలిన చెట్టు
★పంటపొలాలు, వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు కూన, బగ్గు, బెందాళం
★నందిగం: కోతకు గురైన R&B రోడ్డు.. తక్షణ చర్యలు
★పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన పాతపట్నం ఎమ్మెల్యే
★కాశీబుగ్గలో పలు మెడికల్ షాపుల్లో దొంగతనాలు
★పలాస: వరహాల గెడ్డలో వ్యక్తి గల్లంతు
★ నారాయణపురం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నాగావళి


