News March 1, 2025
గాలికుంటు టీకాల పోస్టర్ల ఆవిష్కరణ

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం కింద గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమం 01/03/25 నుంచి 30/03/25 తేదీ వరకు ఉచితంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు.
Similar News
News November 17, 2025
సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్?

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైనే చర్చిస్తున్నారు. తొలుత వచ్చే నెలలో షెడ్యూల్ ఇవ్వాలని భావించినా దాన్ని ఈ నెలలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. SC ఆదేశాల ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. తొలుత నిర్వహించే సర్పంచ్ ఎన్నికలకు 10 రోజుల్లోపే నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.

కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.