News April 15, 2025
గాలివాన బీభత్సం

అనంతపురం జిల్లాలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. తాడిపత్రి, గార్లదిన్నె, పెద్దవడుగూరు, పుట్లూరు తదితర మండలాల్లో ఉరుములు, పెరుపులతో కూడిన వర్షం పడింది. గార్లదిన్నెలో భారీ వేపచెట్టు నేలకొరిగింది. గాలివానకు అరటితోపాటు మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. మరోవైపు నేడూ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Similar News
News October 26, 2025
సత్తుపల్లి మెగా జాబ్ మేళాకు భారీగా రాక

ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే 2 వేల మందికి పైగా హాజరయ్యారు. సింగరేణి, టాస్క్ సహకారంతో హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 66 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. నిరుద్యోగుల కోసం 66 కౌంటర్లు, భోజన వసతి ఏర్పాట్లు చేశారు.
News October 26, 2025
కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న నగరం

బొల్లారం, బాచుపల్లి, మియాపూర్, అమీన్పూర్ పారిశ్రామికవాడలోని ఆయిల్, కెమికల్ కంపెనీల కారణంగా ఈ ప్రాంతాల్లో గాలి విషపూరితంగా మారుతోందని ప్రజలు వాపోతున్నారు. వీటినుంచి విడుదలవుతున్న వాయువులను పీల్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సంబంధిత అధికారులు మౌనం వ్రతం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 26, 2025
చనిపోయిన స్నేహితుడిపై ఎర్రిస్వామి ఫిర్యాదు

బైక్ ప్రమాదంలో చనిపోయిన శివశంకర్పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి కర్నూలు (D) ఉలిందకొండ PSలో ఫిర్యాదు చేశాడు. ‘నేను, శివశంకర్ మద్యం సేవించాం. అతడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరం కిందపడిపోయాం. శివ స్పాట్లో చనిపోయాడు. డెడ్ బాడీని పక్కకు తీసేందుకు ప్రయత్నించాను. మా <<18102090>>బైకును<<>> మరో వాహనం ఢీకొట్టడంతో అది రోడ్డు మధ్యలో పడింది. దీంతో బస్సు బైకును లాక్కెళ్లింది’ అని తెలిపాడు. దీంతో శివపై పోలీసులు కేసు నమోదు చేశారు.


