News January 11, 2025
గాలివీడు MPDOపై మరోసారి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

గాలివీడు MPDOపై డిసెంబర్ 27న దాడి జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘MPDOపై దాడి జరిగినప్పుడు.. కన్నతండ్రిపై దాడి జరిగితే కన్న కొడకు ఎలా స్పందిస్తాడో అలానే నేను కూడా స్పందించా‘ అని తెలిపారు’. అందుకే విషయం తెలియగానే కడపకు వెళ్లి పరామర్శించినట్లు తెలిపారు.
Similar News
News March 2, 2026
పుష్పగిరి నీళ్లలో యువకుని మృతదేహం లభ్యం

పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీళ్లలో ఈత కోసం దిగి గల్లంతైన చైతన్య మృతదేహం లభ్యమైంది. రిస్క్ టీం సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని జాడ కనిపించలేదు.
News March 2, 2026
ప్రొద్దుటూరు హాస్టళ్లో విద్యార్థి సూసైడ్.. డీఈవో ఆరా.!

పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. MEOలు శోభా, సావిత్రి, AMO విజయభాస్కర్ ఉన్నారు.
News March 2, 2026
ప్రొద్దుటూరు: హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

ప్రొద్దుటూరు పట్టణంలోని SC హాస్టల్లో విద్యార్థి మృతి కలకలం రేపింది. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి నరసింహులు(15) 10వ తరగతి చదువుతున్నాడు. మోడంపల్లె హాస్టల్లో ఉంటున్నాడు. ఏమైందో ఏమో రాత్రి హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


