News December 30, 2024
గాల్లోకి ఎగిరిన కారు.. మహిళ స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లక్కె పద్మ(47), ఆమె కుమార్తెలు లక్ష్మీ, మాధవిలు బొంతలు కుట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం వాళ్ళు ఆటోలో ఒంగోలు వెళ్తుండగా పెళ్లూరు వద్ద డివైడర్ని ఢీకొన్న ఓ కారు గాల్లో ఎగిరి ఆటోపై పడింది. ఘటనలో పద్మ స్పాట్ లో చనిపోయారు. కుమార్తెలు ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. దీంతో వెంకటాయపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి
Similar News
News October 16, 2025
ప్రకాశం జిల్లాలో 2 హైవేలు ప్రారంభం.!

కర్నూలు జీఎస్టీ సభ వేదికగా ప్రధాని మోదీ వివిధ పనులను గురువారం ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. వాటిలో ప్రకాశం జిల్లాలో (1) కనిగిరి బైపాస్ (2) సీఎస్‌పురం 2 లైన్ బైపాస్‌లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే రూ.4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
News October 16, 2025
ప్రకాశం వంటకాలలో స్పెషల్ ఇదే!

నేడు ప్రపంచ భోజన దినోత్సవం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వంటకాల స్పెషాలిటీ చూస్తే నోరు ఊరాల్సిందే. జిల్లాలో ప్రధానంగా ఊరగాయ పచ్చళ్లు వెరీ ఫేమస్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఒంగోలు నగరానికి ఎవరైనా వచ్చారంటే చాలు.. ఇక్కడి వంటకమైన మైసూర్ పాక్‌ను రుచి చూడాల్సిందే. ఒంగోలు నగరం నుంచి విదేశాలకు కూడా మైసూర్ పాక్ తరలి వెళుతుందంటే.. ఆశ్చర్యం కలిగించక మానదు. మరి మీరు మైసూర్ పాక్ టేస్ట్ అనే చేశారా!
News October 16, 2025
ఉపాధి అవకాశాలు కల్పించాలి: కలెక్టర్ ఆదేశం

నైపుణ్యాభివృద్ధి, మరిన్ని ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలు, అనుబంధ విభాగాలు పని చేయాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులతో బుధవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. జిల్లాలో పరిశ్రమల స్థితిగతులు, కొత్త వాటిని స్థాపించేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి అధికారులు వివరించగా, కలెక్టర్ పలు సూచనలు చేశారు.