News December 30, 2024

గాల్లోకి ఎగిరిన కారు.. మహిళ స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లక్కె పద్మ(47), ఆమె కుమార్తెలు లక్ష్మీ, మాధవిలు బొంతలు కుట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం వాళ్ళు ఆటోలో ఒంగోలు వెళ్తుండగా పెళ్లూరు వద్ద డివైడర్‌ని ఢీకొన్న ఓ కారు గాల్లో ఎగిరి ఆటోపై పడింది. ఘటనలో పద్మ స్పాట్ లో చనిపోయారు. కుమార్తెలు ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. దీంతో వెంకటాయపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి

Similar News

News January 20, 2025

ఖోఖో ప్రపంచ కప్‌లో ప్రకాశం కుర్రాడి సత్తా

image

ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

News January 20, 2025

సిమ్లాలో పర్యటించిన పట్టణ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, ఎంపీ మాగుంట

image

గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా ఆ కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బృందం ఆదివారం సిమ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వసతులపై స్థానిక ప్రజలతో‌ ఆరా తీశారు. పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరలో‌ నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.

News January 19, 2025

ప్రకాశం: సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా నిర్వహింనున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. గత సోమవారం భోగి పండుగ సందర్భంగా “గ్రీవెన్స్ డే” ను తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల కోసం సోమవారం అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.