News June 5, 2024
గిద్దలూరులో నోటాకు అధిక ఓట్లు

గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ముత్తుముల కంటే నోటాకే ఇక్కడే ఎక్కువ ఓట్లు వచ్చాయి. 21 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగ్గా ప్రతి రౌండ్లో ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ లో నోటాకు అత్యధికంగా 174 ఓట్లు లభించాయి. నియోజకవర్గంలో 21 రౌండ్లలో నోటాకు 2,233 ఓట్లు వచ్చాయి. కాగా ముత్తుములకు 973 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News November 27, 2025
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.
News November 27, 2025
ప్రకాశం: నకిలీ బంగారంతో కేటుగాళ్ల బురిడీ

త్రిపురాంతకంలోని ఓ జ్యువెలర్స్ షాప్‌లో ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారం పెట్టి యజమానిని బురిడీ కొట్టించారు. 28 గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి రూ.1.50లక్షలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యటు చేపట్టారు.
News November 26, 2025
29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.


