News June 27, 2024
గిద్దలూరు: ఎట్టకేలకు.. చిక్కిన చిరుత
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని దేవనగరం గ్రామ సమీపంలోని గోతిలో చిక్కుకున్న చిరుతను 24 గంటలు శ్రమించి ఎట్టకేలకు అధికారులు బంధించారు. ఫీల్డ్ డైరెక్టర్ డీఎన్ఎస్ మూర్తి ఆదేశాల మేరకు చిరుతను అటవీశాఖ అధికారులు గురువారం తరలించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, గ్రామ ప్రజలు ఊపిరిపీల్చుచుకున్నారు.
Similar News
News December 11, 2024
ప్రకాశం జిల్లా వైసీపీ నేతలతో ఇవాళ జగన్ భేటీ
వైసీపీ అధినేత జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో ఇవాళ భేటీ కానున్నారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో ఓటమి, బాలినేని పార్టీ వీడటం సహా పలు అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
News December 10, 2024
విద్యుత్ వాహనాల పెంపుపై మాగుంట ప్రశ్న
దేశంలో, రాష్ట్రంలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి, ఏర్పాటుచేసిన ఫ్యాక్టరీలు, కేటాయించిన నిధులపై ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మంగళవారం పార్లమెంట్లో ప్రశ్నించారు. దీనిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సమాధానమిస్తూ గత ఐదేళ్లలో 1,68,263 వాణిజ్య, మూడు చక్రాల, రెండు చక్రాల విద్యుత్ వాహనాలు ఉత్పత్తి అయ్యాయన్నారు. దేశంలో 257 తయారీ యూనిట్లు ఉండగా రాష్ట్రంలో నాలుగు ఉన్నాయని వివరణ ఇచ్చారు.
News December 10, 2024
పొదిలిలో 300 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
పొదిలి అడ్డరోడ్డు సమీపంలోఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళ వారం ఎన్ఫోర్స్‌మెంట్ ఆర్డీవో, ఆర్‌ఐ, వీఆర్‌వో కలిసి అక్రమంగా దాచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఎక్కడ నుంచి తెచ్చారు, ఎన్నిరోజుల నుంచి ఈ దందా జరుగుతుందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.